Blogs
నాకిష్టం లేకపోయినా నన్ను చంపినారు... పొట్టి శ్రీరాములు
తాతా... పొట్టి శ్రీరాములు తాతా...
యాడున్నావో గాని ఈడ నీ మనుమల సూస్తివా...
నువ్వు చేసిన త్యాగాన్ని కూడా మర్శిండ్రు
నువ్వు కలగన్న ఆంధ్ర రాష్ట్రాని ఏనాడో చెడిపిండ్రు
పీతలమ్ముకొస్తామని మా ఊరోచ్చిండ్రు
అప్పటికే పాణం ఎల్లదీస్కుంటున్న అవ్వ గంజికి అర్రులుజాచిండ్రు
పందేంట పంది పిల్లల్లన్నట్లు, వొస్తానే ఉండ్రు... ఇప్పటికీ...
పోనీలే, ఒసార్ల పండుకొని సూరు నీళ్ళు తాగి ఉంటారని జర్రంత జాగ ఇస్తే...
సూరెక్కి ఈ గుడిసె నాది, ఈ గూడెం మాది అన్నట్లు
మా గుండెలల్ల గునపాలతో తొవ్వి మరీ గుంజలు పాతుకున్నరు
ఆమరణ దీక్ష మేము అడిగినామా..?
ఆమరణ దీక్ష మేము అడిగినామా..?
సాదిస్తున్నర... లేక సాగదీస్తున్నర...
మా పొయ్యింట్ల ఇంగ్లం ఎయ్యనియ్యకుండ
రెండ్రోజుల కొక్కన్ని కాటి గడ్డకు పంపుతున్నరు
ఒకని మూడొద్దులు చెయ్యకముందే
ఇంకోడు పాణందీసుకుంటుండు
ఒకని దినాలకు ఇంకోని శవ యాత్ర అడ్డమొచ్చే
కానీ...
ఒక లంగ గాని జిత్తుల మారి ఎత్తు మరిచిపోక ముందే
ఇంకొకడు దుశ్శాసనుల పొత్తు పెట్టుకుంటుండు
ఏం పరాశ్కమాడుతున్నర..?
ఒక దిక్కు సావొద్దు... బతికి సాదించుకుందాం అనుకుంట
ఇంకో దిక్కు నన్నెవడన్న ఆపితే ఆత్మ బలిదానం చేసుకుంట అననీకె
ఏం పీకావని... ఇంకేం పీకుతావని...
నమ్మిన నా రాజే నరహంతకుడా..?
నమ్మిన నా రాజే నరహంతకుడా..?
ఏమో అనిపిస్తుంది...
ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే
మొన్న... సహాయ నిరాకరణ
అధిపతుల పీటం కడులుతుందన్న
సందర్బంలో... అకస్మాత్తుగా అప్పెయ్యమనడం
నిన్న... సకల జనుల సమ్మె
ఆదిపత్యాలకు చెమటలు పడ్తున్న సమయాన
సమ్మెలో సడలికలు
ఇయ్యాల... పోలవరం
పోటెత్తే మాటల కోటలుగట్టి
నమ్మ బలికిన నమస్తే తెలంగాణ లో
అనుచరుడికే దక్కిందని అభినందన కేరింతలు
పోటు మీద పోటు
పోటు మీద పోటు...
నమ్మిన నా రాజే రాజకీయం చేస్తున్నాడా...
నమ్మించి నా తమ్ముల ప్రాణాలు తీస్తున్నాడా...
ఆగరా ఇంకా..? ఈ సావులు ఆపరా ఇంకా..?
రాయమని నా పెన్ను ఉరుకులాడినా
నా తెలంగాణ ఇంట్ల పీనుగుంటే
రాయనీకె నా మనసొప్పుత లేదు...
ఎడమ చేతి పిడికిలి లాగ కుడి చేతిలో పెన్నుగూడ
బిర్రుగ బిగుసుకుంది... సుక్కవెట్టనీకే కూడా కదలక
కన్నీటి సుక్కలతో కాయితం తడిశిపోతుంది...
ఏం రాయాలి "మీ" గురుంచి..?
ఆత్మ బలిదానం చేసిన వీరులనా..?
అంతరాత్మ ను జయించలేని పిరికోల్లనా..?
అన్ని మరిచి...
అన్నదమ్ములను అమ్మ నాన్నను
అయిన వారిని కాని వారిని...
ఆగమైన ఆ గుండెలను...
ఆత్మ వంచన చేసుకోమంటిరి
వినూత్న రూపాలలో తెలంగాణ ప్రజానీకం
నిరసన తెల్పుతున్నదనీ
Ode to Prof Jayashankar
నిశబ్ధం...!
ఆదిగురువు ఇక లేరు అన్న విషయం... ఒక నిశబ్ధం...
ఈ గడ్డ మన్ను తిన్న మానవాళి వెన్ను తట్టి
వేగు చుక్కలా దారి చూప మిన్నుకేగిన
ఆదిగురువు ఇక కనపడరన్న మాట... ఒక నిశబ్ధం...
తెలంగాణ సాధనకు తెరలేపి...
ఉద్యమం తారా స్థాయికి చేరిన సమయాన తారాలోకానికి తరలిపోయిన
ఆదిగురువు మనకు లేరన్న నిజం... ఒక నిశబ్ధం...
కానీ...
తన కలలలో ఈ నిశబ్ధానికి తావులేదు
ఒక్కొక్క తన విధ్యార్ధిలో నింపిన ఉద్యమ ఊపిరిలో నిస్తేజానికీ తావులేదు
ఆచార్యుడి ఆలోచనలు అమలు చేసి
తను కన్న కలల తెలంగాణ తెచ్చి
మేలుకో ఓ మనిషి మేలుకో...
అడుగు ముందుకేసి అడుగు నీ జాడ ఏదని...
అడుగు ముందుకేసి అడుగు నీ నీడ ఏదని...
అడుగక అడుగక నీ నేలల నువ్వే అడుగంటుకపోయినావ్
అడవి చీర అందానికి అడుగడుగునా తూట్లు పొడిచి
అడ్డగోలుగా కట్టుకున్న అద్దాల మేడల్లోంచి
నీ చిల్లుబోక్కేన జూసి
నీ భూమిల ఎండిన బావుల జూసి
పర్రెవాసిన నీ నల్ల రేగడి జూసి
కొర్రముద్దలకు అర్రులు సాచే నీ వెర్రితనము జూసి
గర్వంగా నవ్వుకుంటున్నారు
ఇప్పటికైనా...
మేలుకో ఓ మనిషి మేలుకో...
మేలుకో ఓ మనిషి ఏలుకో ఈ లోకాన్ని...
ఓ నాగరీకుడా... ఏదీ నీ నాగరికతా... ఏందీ నాగరీకతా...
పల్లె అన్న ఆ పదానికున్న పదును జూసి మాట్లాడు
పల్లెటూళ్ళలో మగ్గుతున్న ఆ జనాన్ని జూసి మాట్లాడు
పల్లె సీమలె ఈ పట్టణాలకు పుట్టగోడుగులని మరిసినావ్
పల్లె ప్రజలను విస్మరించి ఏం పురోగతి సాధించినావ్
నాగరీకుడా... నీ పట్టణానికి పట్టెడన్నంబెట్టె
మన పల్లెటూళ్ళను ఎందుకు తుడిచి పెడ్తున్నావ్
అలమటిస్తున్న కడుపులను
తడారని ఆ గొంతు ఆపేక్షలను
అలుముకున్న చీకట్లను
ఆదరించే చేతులు నీకు లేకపోయినా
అడివితల్లి కన్న బిడ్డలను ఆగం ఆగం జేస్తున్నావ్
నాగరీకుడా... నీ మనిషి రూపానికి పిడికెడు గుండె వెట్టినా...
అంతా అయిపోయినట్టూ...
కే. శివారెడ్డి జైత్ర యాత్ర అనే కవితా సంకలనం లోని " అంతా అయిపోయినట్టూ" అనే కావ్యం నన్ను బాగా ఆకర్షించింది...
ఆ కావ్యం అచ్చం తెలంగాణ యాసలో లేకపోయినా... ఆ విప్లవ వాసన... ఆ పోరాటం పటిమ... ఉవ్వేతున ఎగుస్తున్న ఉడికే రక్తపు ఊపిరి...
నా దేహనికున్న ఎంటిక ఎంటికను నిక్కబొడిపించింది... మన ఉద్యమానికి మల్ల ఊపిరిపోస్తుందని మీతో పంచుకుంటున్నా
అంతా అయిపోయినట్టూ
యుద్ధం చేసి అలిసిపోయినట్టూ చతికిల పడ్డారేం
దిక్కులు చూస్తున్నారేం
తెగ ఆయాసపడి పోతున్నారేం
అయ్యా... నలమోతు నరకాసురా...
అయ్యా... నలమోతు నరకాసురా...
నా తెలుగు మూలాలని నవల రాసుకోని
నలుగుట్ల నీ పండ్లిగిలిస్తివి...
అసలా మూలల జాడేదో తెలిసేనా...
నల్గొండ జిల్లా అంటావ్... నాది తెలంగాణే అంటావ్...
మరి నల్లతుమ్మ గోందు వాసన జూస్తివా...
ఉమ్మెంత పువ్వంటే గుర్తుపడ్తవా...
చెలక భూముల్ల నడువగల్గుతవా...
మోటబొక్కెన ఎపుడన్నా కండ్లతో నన్న జూస్తివా...
బతుకమ్మ లోపల ఏముంటది ఎరుకేనా...
గునుగు పువ్వు అసలెట్లుంటదెరుకేనా...
చేతబావిల ఊటలకు చిల్లు బొక్కెన జూస్తివా...
తోలు డప్పు దరువు నీ చెవులతోటి వింటివా...
సీసకమ్మరి పొదలంటే నీకు తెలుసా...