అయ్యా... నలమోతు నరకాసురా...


By kompally - Posted on 02 November 2011

అయ్యా... నలమోతు నరకాసురా...
నా తెలుగు మూలాలని నవల రాసుకోని
నలుగుట్ల నీ పండ్లిగిలిస్తివి...
అసలా మూలల జాడేదో తెలిసేనా...

నల్గొండ జిల్లా అంటావ్... నాది తెలంగాణే అంటావ్...
మరి నల్లతుమ్మ గోందు వాసన జూస్తివా...
ఉమ్మెంత పువ్వంటే గుర్తుపడ్తవా...
చెలక భూముల్ల నడువగల్గుతవా...
మోటబొక్కెన ఎపుడన్నా కండ్లతో నన్న జూస్తివా...
బతుకమ్మ లోపల ఏముంటది ఎరుకేనా...
గునుగు పువ్వు అసలెట్లుంటదెరుకేనా...
చేతబావిల ఊటలకు చిల్లు బొక్కెన జూస్తివా...
తోలు డప్పు దరువు నీ చెవులతోటి వింటివా...
సీసకమ్మరి పొదలంటే నీకు తెలుసా...
ఊదు వాసన నీ ముక్కుకంటిన్దా...
అసైదుల్ల ఆటల్ల ఎపుడన్నా చేయ్యేస్తివా...
ఊరడమ్మ గుడిల ఎపుడన్నా కాలుపెడ్తివా...

ఏది చక్రవర్తీ... నీ రాజ్యమేది...
నీ భూమేది... నీ బతుకేది...
అన్నమో రామచంద్ర అంటె... గంజి గతికే అవ్వ గూడ
అయ్యో కొడకా... అంటది నా తెలంగాణల...
అటువంటి నా భూమిని నగువట్లు జేస్తే...
బోర్లబొక్కల పడి చిల్లర పైసలేరుకున్టావ్...
అప్పుడు రాడు ఇప్పుడు నీకు పచ్చనోట్లిచ్చినోడు
భాస్మసూర కోరిక కాదు ఇది...
భగ్గున మండుతున్న గుండెల కేక... ఇప్పుడే పుట్టిన తెలంగాణ బిడ్డ కేరింత...
ఎన్నారై అని చెప్పుకోకు... నాకు సిగ్గయితది మల్ల నా ఊళ్ళ కాలువెట్టనీకే...
నోటికి మాటొస్తే... జై తెలంగాణ చెప్పుకో... రాకపోతే ఇంత మన్నువోసుకో...
                                                                  -- శ్రీనివాస్ రెడ్డి కొంపల్లి