మేలుకో ఓ మనిషి మేలుకో...


By kompally - Posted on 02 November 2011

అడుగు ముందుకేసి అడుగు నీ జాడ ఏదని...
అడుగు ముందుకేసి అడుగు నీ నీడ ఏదని...
అడుగక అడుగక నీ నేలల నువ్వే అడుగంటుకపోయినావ్
అడవి చీర అందానికి అడుగడుగునా తూట్లు పొడిచి
అడ్డగోలుగా కట్టుకున్న అద్దాల మేడల్లోంచి
నీ చిల్లుబోక్కేన జూసి
నీ భూమిల ఎండిన బావుల జూసి
పర్రెవాసిన నీ నల్ల రేగడి  జూసి
కొర్రముద్దలకు అర్రులు సాచే  నీ వెర్రితనము జూసి
గర్వంగా నవ్వుకుంటున్నారు
ఇప్పటికైనా...
మేలుకో ఓ మనిషి మేలుకో...
మేలుకో ఓ మనిషి ఏలుకో ఈ లోకాన్ని...
చండ్రకోల జులిపి... చెలరేగి ఏలుకో నీ రాజ్యాన్ని...

- శ్రీనివాస్ రెడ్డి కొంపల్లి

అందె శ్రీధర్ గారి "ప్రకృతి ఘోష" ఆధారంగా... పొడిగింపుగా...