మాతృదేశము
మాతృదేశము మాట ముచ్చట
ముదము గూర్పదు మదికి ననియెడి
పరమనీచుడు ధరణినంతట
గలయ వెదకిన గాననగునా?
నీరులేని ఎడారియైనను
వాన వరదల వసతియైనను
అగ్గికొండల అవనియైనను
మాతృదేశము మాతృదేశమె.
దేశదేశము తిరిగి చూడుము
కొంత హాయియె కూర్చు మదికిని
నాల్గురోజులు నచ్చదేదియు
స్వర్గమే నపవర్గమేనియు.
తల్లి ఏడుపు తండ్రి కోపము
భార్యబిడ్డల ప్రణయపాశము
ఇంచుకైన గణింపనీయదు
మాతృదేశము మాతృదేశమె.
లాఠిదెబ్బల లక్ష్యమేమీ
కఠిన శిక్షయె కాదు కాదు
చావుకైనను జంకనీయదు
మాతృదేశము మాతృదేశమె.
పొట్టకన్నము, కట్టుబట్టయు
లేని బ్రతుకును లెక్కసేయక
యెచ్చటికి బోనిచ్చగింపము
మాతృదేశము మాతృదేశమె.
స్వర్గమే అపవర్గమేయని
చాటి చెప్పెడు జన్మభూమియె
పరులవశమున నరకకూపము
కన్న హేయము కఠినతరము
కన్న హేయము కఠినతరము
--------------------------------------------------------------
స్వాతంత్య్రోద్యమంలో భాగంగా దేశభక్తి
ప్రభోదాత్మకమైన గేయాలను ప్రచురించాలనే
ఉద్దేశ్యంతో సర్ వాల్డర్ స్కాట్ రాసిన
'Lay of the last ministrel' అనే గేయంలోని
'Breathes there a man, with soul so dead
who has not said unto himself, this is my own
native land పైచరణాలను 1940 సం||లో వారపత్రికలో
ప్రకటించే అదే భావంతో వ్రాయమని ప్రకటించగా రాసిన
గేయమిది. ఈ గేయ ప్రారంభంలోని నాలుగు పంక్తులు పై
చరణాలకు అనువాదాలైనా మిగిలిన చరణాలన్నీ మాతృదేశ
భక్తిని వ్యక్త పరుస్తూ స్వీయభావంతో రాసినవి. ఈ గేయం
26-5-1943 నాడు రెడ్డి హాస్లల్లో జరిగిన దశమాంధ్ర
మహాసభ సమావేశంలో ఆంధ్రసారస్వత పరిషత్తు
స్థాపనోత్సవం రోజునజరిగిన మహాసభలో వినిపించినది.
All opinions expressed on this website are those of respective authors. Links to quoted or original material are provided wherever appropriate.com can only be reproduced with clear attributions and a suitable link to the original content. Cheap clonazepam asd
All opinions expressed on this website are those of respective authors. Links to quoted or original material are provided wherever appropriate.com can only be reproduced with clear attributions and a suitable link to the original content. Order clonazepam asd