అఖిల భారత కాంగ్రెస్ ప్రకటన
1. ‘‘భారత విచ్ఛిత్తి చాలు
అందువేరు తెలంగాణ
ప్రశ్న లేదు లేనే లేదు
2. ‘ప్రజామతము’ నాకసలే
సమ్మతమ్ము కాని మాట
ప్రజా మతములో ఎన్నడు
నమ్మకము లేదు నాకు
తెలంగాణ వేర్పాటుకు
ప్రజామతము సేకరణము
మాటే ఎత్తుట తప్పు
తెలంగాణ మందే కాదు.
ఎచటైనను ఏ విషయము
నందైనను ప్రజామతము
సేకరణము పనికిరాదు
3. బ్రహ్మానందుడు ఒక్కడు
చాలు, ఆంధ్రానికి మేటి మగడు
విచ్చల విడిగా అతనిని వదిలి
వేస్తె చాలు చాలు, రెన్నాళ్ళలో
తెలంగాణ నదుపులోకి తెస్తాడు.
4. తెలంగాణ ప్రజలారా!
అలజడి విరమించుకోండి’’.