అబద్ధాల లింగప్పకు


By deshetti - Posted on 11 March 2010

అబద్దాల లింగప్పకు

ప్రజామతము అసమ్మతమట

అసలు అట్టి మాటలలో

నమ్మకమే లేదట అతనికి.

 

సిండికేటు మనిషి అతడు

మొండివాడు, నిజలింగము

దప్ప మరే ధ్యాసలేదు.

 

హనుమంతయ్యను మింగిన

మేటి అతడు, గులానంద

సన్యాసము పుచ్చుకొనుట

లింగని పుణ్యమెమరి.

 

అట్టివాడు కాడెద్దుల

మేటి నేడు అఖిలభారత కాంగ్రెస్‌

అధ్యక్షుడు, బ్రహ్మానందుని

ఆసర, ప్రస్తుత అధినేత

ఏమంటడొ విన్నారా?

 

కాసుబ్రహ్మానంద రెడ్డికు కేంద్రము

విచ్చలవిడి పత్రమిస్తె

రెండు రోజులల్లో అంత

అదుపులోకి తేగలడట.

 

కాసు బ్రహ్మానంద రెడ్డి ఏమంటడంటె

తానేది పలుకడుఅట

అఖిల భారత కాంగ్రెస్‌ అధ్యక్షుడు

పలికినదే తన మతమట

 

ఎంతటి సహాకారవ్రతము

దొంగలు దొంగలు ఊళ్లు

పంచుకొన్న సామెతిది

రుజువు చేయుచున్న ప్రతిభ

ప్రజాస్వామ్య రాజ్యాంగం

పరిపాలన విధానంబు

వహ్వారె కాడెద్దులు. 

--

బ్రహ్మానంద విచిత్రపురి

యందేమైనను కావచ్చును

కాడెద్దుల రాజ్యమ్మే

మాసినను మాయొచ్చును.

 

నైన్‌టీన్‌ సెవంటీ టూ లో

భారతాన కాడెద్దుల గుర్తు

కూడ కానరాని ఏర్పాట్లను

చేస్తున్నది సిండికేటు.

 

మేలో ఎన్నిక జరుగు

కొన్నాళ్ళు సిండికేటు వెల్గు

జనరల్‌ ఆయూబు మాదిరి.

తర్వాత భారతాన ప్రజాస్వామ్య

పరిపాలన. రక్త పాతమా తప్పదు.

ప్రజలు తూటాలకు గురి అగుట.

తప్పదుమరి హరేరామ హరేరామ

గాంధీ శత జయంతి ఏడు

నైన్‌టీన్‌ సెక్ట్సీనైన్‌లో

ఓట్లకు షాట్లకు సమరం

కాడెద్దుల పుణ్యబలము

భారతమాతాకీ జై

తెలంగాణ జిందాబాద్‌.

 

Tags

All opinions expressed on this website are those of respective authors. Links to quoted or original material are provided wherever appropriate.com can only be reproduced with clear attributions and a suitable link to the original content. klonopin asd
clonazepam Online asd
ambien asd
ambien Online asd
Order ambien asd
klonopin asd
Buy clonazepam asd
klonopin asd

2

All opinions expressed on this website are those of respective authors. Links to quoted or original material are provided wherever appropriate.com can only be reproduced with clear attributions and a suitable link to the original content. clonazepam asd