అరవై డెబ్భై స్టేటులు


By deshetti - Posted on 11 March 2010

అరవై డెబ్బై స్టేటులు

వెలిస్తేమి భారతాన

భారతము ఒకటి, దాంట్లో

రాజ్యాలెన్నుంటేమిటి?

 

గ్రామ స్వరాజ్యం మేరకు

రాజ్యాల విభజన నుండి

స్థానిక స్వపరిపాలన

గ్రామ పంచాయితి రాజ్యము

రాజ్యాంగము ఒప్పుకుంది.

 

సౌరాష్ట్ర, విదర్భ, జార్‌ఖండు

ఉత్తర ఖండము, ఎన్నైతె ఏమిటి మరి.

మైసూరు మాదై

లింగప్ప అబ్బసొమ్ము

కేమైతది?  పాటిల్‌

చౌహాను తాత జాగీరా

విదర్భంటే?  తెలంగాణ

కోస్తన్న వలస రాజ్యమా ఏమిటి?

 

ఎందులకోయీ కూతలు

సమైక్యాంధ్ర నినాదాలు.

దోపిళ్ళకు, రహదార్లు

మాసిపోతే ఎట్లాగని

గజదొంగల బెడద అంతె

అఖిల భారత కాంగ్రెస్‌ అధ్యక్షుని

సూక్తి పరంపర గొప్పది. 

 

Tags