తెలుగుబాస ఎన్నితీర్లు


By deshetti - Posted on 11 March 2010

తెలుగుబాస ఎన్నితీర్లు

తెలుగు యాస ఎన్ని తీర్లు

వాడుకలున్నన్ని తీర్లు

వాడుకఏ తీరుగున్న

తెలుగు బాస వాడుకయే

అన్ని తీర్ల వాడుకకు

పరపతి పెత్తనమొకటే

ముఖే ముఖే సరస్వతి

నోట నోట మాటమ్మ.

అన్ని తీర్ల వాడుకను

ఒకే తీరుగా చూచుట

ఎవరి వాడ వారిది అని

ఎవరి వేడ్క వారిది అని

ఎవరిదైన వాడుకే అని.

అందరికి వేడుకగా తలుస్తే.

తెలుగు బాస అభివృద్ధి

ఒకే బాస మాటాడే

తెలుగు వారిలో సమైక్యత

లేకుంటే తన్నులాట

తప్పదు ఏనాటికైన

రెండున్నర జిల్లాల

రెండుమూడు తెగలోండ్లకు

బడిపలుకులబాబులకు

పంజరాల చిలుకలకు

ఎప్పుడు తెలుస్తుందంట

ఎన్నడు తెలిసొస్తుందంట

వాడుక బాషంటే ఏందో?

ఎవరి వాడకం భాషో?

గ్రాంధికాన్ని వద్దంటూ 

--

రెండున్నర జిల్లాల

చదువుకున్న తెగలోళ్ళ

వాడుకనే గొప్పజేసి

దానికె పట్టం గట్టి

గురజాడ’ ‘గిడుగుపేర

మసిబూసి ముండమోపి

రెండున్నర జిల్లాలదె

దండిబాష అంటు చాటి

తక్కినోళ్ల నోళ్లు యాన

తొక్కి నొక్కి పెట్టి వుంచి

రెండున్నర జిల్లాల

చదువుతున్న కుటుంబాల

రెండుమూడు తెగలోళ్లదె

ప్రామాణిక భాషఅని

శిష్టుల వ్యావహారికమని

అందరి తలపై రుద్దితే

ఎక్కడి న్యాయం అంట

ఇంతకన్న అందరికి

ఒకే తీరు ఇబ్బంది (కలిగించి)

ఒకే తీరు సాధన కలిగించే గ్రాంధికము

సాధ్యమైన గ్రాంధికము

నయమనిపిస్తది అన్న

వాడుక బాసఅంటె

రాయవచ్చినోడు రాసే

దస్తూరి వలె కాదా?

దస్తూరిలో లిపి వలనే

మాటల్లో యాసకాదా?

దూస్తురిలో అక్షరాల

రూపువలెనె

మాటల ఉచ్చారణ అవును కాదా?

 

ఎవని యాసలో వాడు

మాట్లాడుతున్నట్లే

ఎవని మాండలికము వాడు

వాడుకొనుచున్నట్లే

ఆ యాసతో, ఆ విరుపుతో

ఆ యమకం గమకంతో

రాస్తె, తప్పేమిటంట?

అన్ని వాడుకలు కూడా

ప్రామాణిక స్థాయి తోడ

వెలుస్తుంటె తప్పేమిటి?

కాళిపట్నం రామారావు బాస బాస కాదా?

రాచకొండ విశాస్త్రి యాసరాత బాసకాదా?

1. ‘‘దయ్యాల పన్గడది’’ మెదక్‌ పలుకు బాసకదా?

2.  అంగుడుపొద్దులోవున్నది కరినగరం బాస కాడా?

3.  సోమరాజు పొద్దులున్న బాసకు పట్టంవద్దా?

4.  కొడుకుపుట్టాలెబెస్తపల్లె బాస బాస కాదా?

                రాయలసీమ వాడి బాస ఇపుడు యాడున్నది?

                శ్రీకాకుళగిరిజనుల తెనుగు తేనెలెచటున్నవి?

                బొబ్బిలి దిబ్బలపులుల గాండ్రింపులు వినరావేం

అందరిచే చిత్తంసార్‌ అనిపించే చిత్తవృత్తి రెండున్నర

జిల్లాల బుల్లోరికి ఎందుకంట?

ముద్దాయిఅన్నమాట

ముద్దయిని మధ్యక్షర దీర్ఘంతో

గుంజిలాగి పల్కితేనే

ప్లేంటిఫ్‌ అక్యూజుడైతడ

ముల్జింఅక్యూజుడు అనుకోండని

అధికార రాజకీయ దుర్మదాంధం

ఏ ప్రాంతం సౌలభ్యం కోసరమని

యేమనవలె ఏటింకా దౌర్జన్యం. 

--

ముద్దాయి అని అంటే

దావా చేసిన వాడు

దావంటె ప్లేంటుకాద?

దావా చేసినవాడు

ముద్దాయి అవునాకాద?

అక్యూజుడుఅనుమాటకు

ముద్దాయితెలుగుజేసి

ముల్జింమాటకు మారుగ

వరంగల్లు అదాలత్‌లో

బోర్డుపెట్టి ముద్దాయంటే

నీబాంచెను గులాపోణ్ణి

అన్నోనికి, చిత్తంసార్‌, చిత్తంసార్‌

అన్నోనికి, ఫరఖేమిటి, భేదమేంది?

రోడ్డంటేతప్పుకాని వేత్తలంత

సడకంటెచెవులు మూసుకొనుటెందుకు

టీహాయిగ చప్పరిస్తు -

ఛాఅంటే ఛా ఛాఅని

మొగమేదో తాగినట్లు

వ్రేలాడించడమెందుకు?

కోర్టుని’ ‘హైకోర్టునిగౌరవంగ

పలుకన్నలు,

అదాలత్‌అని అంటెను

న్యాయస్థానము వారికి

అవమానం జరినట్లు

ఉలికి ఉలికి పడుటెందుకు?

మా అమ్మ వచ్చిందని అనుకుంటూనె

మా నాయిన వచ్చిండని అన్నందుకె

చెవులు మూసుకొనుటెందుకు?

మందలించుటని అంటే

తమ వాడుక బట్ట్టి దాన్ని

చీవాట్లనిఅర్ధించుక

పరామర్శ’ ‘పలకరింపు

అను అర్ధంలో వాడుక

తెలంగాణ ప్రాంతంలో

ఉన్నదన్న తెలివిడికూడాలేక

కయ్యానికి కాలుదువ్వు సహృదయం

నేమనవలె?

పోయిందంటే చచ్చిపోయిందని

అనుకొనుట ఎందులకని

నక్కలగుట్టలో వున్న

ల్యాండ్‌ మార్టుగేజుబ్యాంకు

ఆరాజీరహన్‌ బాంకుబోర్డే మంటది.

భూమి తనఖా బాంకటదానిపేరు.

తనఖాఅంటే జీతం

తెలంగాణ వాడుకంత

తనఖా అంటే జీతం

పారసీ పదం అది

సర్కారు పరిభాషలో

నిజామంత వందలేళ్ళు

వాడుకకెక్కిన పదమది

కోటిన్నర తెలుగోళ్ళకు

తనఖాఅంటే జీతం

వారిని తనఖా అంటే రహనని (మార్టగేజని)

అర్ధం చేసుక చావండని

ఈ తీరుగ లొంగదీస్తె

అడిగే వాడే లేడా?

--

దర్జాయన, మేరాయన

అంటేనే ఏవగింపు ఎందులకని?

టైలరుఎక్కడి తెనుగు?

సేగెదారుతెలుగుకాదు.

క్లరకుఅంటే తెలుగా?

ఎన్‌.జి.వో, ఎల్‌.డి.సి. యూ.డి.సి అంటే తెలుగా?

బి.డి.ఓ, చేర్‌మన్‌, హెచ్‌.ఎవ్‌ు, పి.ఎం, సి.ఎం.

అన్నమాటలే తెలుగా?

హైద్రాబాద్‌ దుకాణం పేర్ల బోర్డులన్ని

ఇంగ్లీషులో వున్నాయని

ఏడ్సిండట ఒక ప్రతినిధి

తెలుగు మహా సభల,

దుకాణం దుకాణమంటే

ఎందుకన్న అదరిపాటు.

కొట్టుషాపంటే మెప్పు

కులుకు పాటు ఎందులకని?

సిల్‌సిలాగా పెట్టిన్నని

సేగెదారు అంటేనె

సీరియల్‌ను యీ వెధవలు

సిల్‌సిలాఅంటాన్రని

వెక్కిరించు రెండున్నర జిల్లాల

చిలుక పలుకు అధికార్లను

తెనుగు భాష మాట్లాడే

భావ సమైక్యతకై కృషి చేసే

నన్నయ్యని కొలవాల్నా?

పళ్ళు విరగ తన్నాల్నా?

ఆంధ్రప్రదేశ్‌ రాజ్య సమైక్యత

చెదిరి పొయ్యే దుర్ఘటన ఏర్పడెనట

ఆంధ్రప్రదేశ్‌ రాజ్యానికెంతో

ప్రాణాంతకమై పోయిందట.

గండం తప్పిందట

అందుకె రాష్ట్ర సమైక్యతను

నిలిపుంచే ఘనసంకల్పంబట?

ప్ర. తెలుగు మహాసభలట

ప్ర. తెలంగాణ ప్రదేశం

రాజ్య మొకటి ఏర్పడితే

భారత జాతి సమైక్యత

కేమిటి అపకార మంట?

రాజ్యాల విభజనము

గ్రామ స్వరాజ్యం మేరకు

అవునా కాదా?

తెలంగాణ ప్రదేశమంత

వేరే రాజ్యంగా వుంటే

భారత రాజ్యాంగానికి ముప్పొస్తద?

ఆ కోరిక వుండటయే దేశద్రోహమా?

తెలుగు భాషతో వైరమా?

ఇవి యన్ని దొంగమాటలేన కాదా?

ప్ర. తెలుగు మహాసభల ముసుగేసుక

తెలంగాణఏర్పాటు

ఆంధ్రప్రదేశ్‌ రాజ్యవిభజన

కోరికయే ద్రోహమ్మని

చాటించే అధికారం

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ముఖ్యమంత్రి

జలగం వెంగళరావుకు ఎవడిచ్చెను?

ఇది అధికార దుర్వినియోగంబౌనకాదా?

రాజ్యం విభజన కోరెడి వారందరు

భారతపౌరులు అవునా కాదా?

--

తెలుగుదేశమను మాటకు

తెలుగుజాతిఅనుమాట కర్థమో

మనందరది భారతజాతే జాతని

భారత దేశ మొక్కటే

మనమందరది భారతజాతే జాతని

భారత దేశ మొక్కటే

మన అందరి దేశమ్మని

భారతదేశం లోన

హిందీ భాషీయులంత

ఒక రాజ్యంలో లేరని

భారతీయులే వారని

తెలుగుబాస మాట్లాడే

వారుకూడా రెండు మూడు

రాజ్యాలుగా విడిపోతే

భారతదేశ సమైక్యత

భావం ఇసుమంతైనా కుంటుబడదు

అను సంగతి

తెలుగుజాతి

తెలుగుదేశంలోని వారికి

నచ్చజెప్పు విధమేది?

తెలిసి కూడ

రెండున్నర జిల్లోళ్లు

రెండు మూడు తెగలోళ్లు

చదువుకున్న కులపోళ్లు

రెండున్నర జిల్లాలదే

దండిబాస అని అంటే

అధికార మంత గూడ

తామే పంచుక తింటే

తక్కినోళ్ల నోళ్లయాస

తొక్కిపెట్టి నొక్కేస్తే

తిరగబడాల్న వద్దా?

తెలుపండి నలిగెటోళ్లు

హైద్రాబాదు తెలుగుపట్న మోలె

లేదంటె అది తెలుగుజాతికె సిగ్గట

ఆ మహానుభావునకు తెలియదింక

హైద్రాబాదే కాదు ఆ మాటకొస్తే.

తెలంగాణ మరాట్వాడ

కర్ణాటక జిల్లాలతో వెలసినట్టి

ప్రదేశమంత వివిధ భాషలకూడలి

వివిధ సంస్కృతులకు కూడలి

మీనియేచర్‌ ఇండియా

హైద్రాబాదను నగరం

నేటికి భారతమను మనదేశం

రూపానికి చిహ్నము, ప్రతీక.

జైహింద్‌  జై తెలంగాణ.

Tags

I am often to running a blog and i really appreciate your content. The article has actually peaks my interest. I'm going to bookmark your site and hold checking for brand new information.
'Revitol dermasis in houston' Diachronic Lortab vs neurontin infuriate Elavil paraphilia