నిజ లింగప్ప అభీష్టము
నిజ లింగప్ప అభీష్టము
తీరుగ బ్రహ్మానందుడు
కేంద్ర సమ్మతము బడిసి
తెలంగాణలో శాంతిని
నెలకొల్పగ ఉద్యుక్తుడు.
బ్రహ్మనందుడు శాంతిని
నెలకొల్పిన తక్షణంబె
కేంద్రము తెలగాణీయుల
క్షేమమరయ నున్నదట
బ్రహ్మానంద ఉవాచ.
నాయకులను రాజమండ్రి
జేలులో పడవేసినంత
వచ్చిందా బ్రహ్మన్నకు
ఈ పాటి బలము ధీమ.
తెలంగాణ అలజడంటె
నాయకులేనా ఏమిటి?
బ్రహ్మన్న బడితె బాట
బట్ట బైలు పడనున్నద?
ప్రజల రెచ్చి పొయ్యేందుకు
బ్రహ్మానందుని బడితె
మరో సమిధికానున్నద?
మళ్లి హింసకాండ రేగి
పోవాల్నని ప్రభుత్మంబు
చాలు బాజి ధోరణితో
ముందుకు మళ్లొస్తున్నద?
ఈ సారి ఓట్ల నెదుర
షాట్లకె పని పెడ్తారట
మూడో జూన్ నాటి నుండి
తూటాలతో సిద్ధంగా సైనికులు
ఉన్నారట. వారికిపుడు
చేతులనిండా పని.
ప్రజలు కూడా సిద్ధంగా
ఉన్నారు ఎదిరి నిల్వ
చేత ఏమి లేని జనత
చేత కానిదా కాదు.
పాణాలొడ్దైన తుదకు
ధ్యేయము సాధిస్తారు.
జాతిపిత శత జయంతి
సంవత్సర సంబరాలు
ఓట్లకు షాట్లకు సమరం
ఈ దెబ్బకు భారతాన
కాడెద్దుల గుర్తు మునుగు.
పార్టీ రాజకీయాలకు
కాలూనే చోటుండని
ప్రజాస్వామ్మ రాజ్యాంగం
రాణించే శభదినాలు
రానున్నవి. రానున్నవి.
దాని కొరకు ప్రజాస్వామ్య
వ్రతనిష్ఠులు తెలంగాణ
పౌరుల ప్రాణాలు బలి
అయితే అయితాయి.
కాని కాడెద్దులు
వృషభాసుర బలగాలు
రూపు మాసి పోతాయి.
సిండికేటు మటుమాయం
కానున్నది కానున్నది.
ఆరి పొయ్యె దీపము వలె
కాంగిరేసు వెలుగుతాంది.
భారతామాతాకీ జై.
తెలంగాణ జిందాబాద్.
--