ప్రజాస్వామ్య పద్దతిలో
ప్రజలు కాదను ప్రభుత
నిలుస్తుంద? నిలువదు
తెలంగాణ ప్రజలు నేడు
ఏ పార్టీతో కలిసున్నారు.
అందగనున్నది నేడు.
ప్రజల మతము కాదనుచు
కాడెద్దులు, కామరేడ్లు
జన సంఘములు, యస్.పి
పి.యస్.పి. ఇత్యాదులు
సమైక్యాంధ్ర నినాదాల
సన్నాయిలు ఊదుతాన్రు.
ఇతైహాదు నాయకులు
కుత్తుకతో పొత్తులేదు.
సామాన్యులు అయిన తురక
ప్రజలందు ప్రజాసమితి
అందుకె అంటాను నేను
ప్రజాస్వామ్య పద్ధతిలో
తెలంగాణకే విజయము
పార్టీలన్నియు మాసై
మాయునేమో మాస్తె
మాయునేమో కాని తుదకు
వచ్చి తీరు తెలంగాణ
భారతమాతాకీ జై
తెలంగాణ జిందాబాద్.
Tags