శాంతిగ మెలగుట మంచిదె కాని...
ఏమి సభ్యతిది? ఏమి విజ్ఞతిది?
ఎవరి ప్రేరణల ఫలిత్ సఖుడా!
ఆదిమానవు మాదిరిగున్నది
అచ్చంగా మన నడవడి సఖుడా?
నాటి మతము వలె నేటి ఇజాలును
కాటులాట పెడుతున్నవి సఖుడా?...
మానవుణ్ణి
జరిగిందంతా చూస్తూ
ఎరగనట్లు పడి ఉండగ
సాక్షీభూతుణ్ణి గాను
సాక్షాత్తు మానవుణ్ణి
1968 సం|||
తెలివి ప్రమాదం ప్రళయం
ప్ర.మ. చరిత్ర రహస్యాలు
మంత్రుల భాగ్యం వనరులు
సి.బి.ఐ.యే ఎరుగదు.
సామాన్యుడు తెలిసికొనగ
సాహసించ రాడెన్నడు
తెలివి ప్రమాదం ప్రళయం
శాంతి భద్రతలకు భంగం...
ఆవారా కుక్కలు
ఏ పని లేక
వాడ వాడలా తిరిగే ఆవారాకుక్కలు
బిచ్చపు దేవులాటే వరంగా పొందిన దీనులు
వాని వీని చెప్పు దెబ్బలే సంపద
లోకం 'ఛీ', 'థూ'లే వాటి సంపాదన
రాత్రిళ్లు శాంతి లేదు...
కంచం మంచం అందని మనిషికి
మానవుని మనుగడు స్థాయికి
కంచం మంచం వరకే పరిమితి
ఉండకూడదు నిజమే కాని
అవి ముందు తీరితే గద ముందడుగు
అందాకా
బ్రతుకు రాకెట్టు పరుగులు
కంచం మంచం చుట్టే ; నేస్తం!...
తిరుగబడమంటే తప్పా?
ఓసీ ప్రభుత్వమా!
దోపిడి వర్గాల నువ్వు అదుపులో పెట్టజాలనప్పుడు
పీడిత వర్గాల నేను తిరుగబడమంటే తప్పా?
బ్లాకు మార్కెటుదార్ల నల్లబజారు కుబేరుల
నువు ఉరిదీయలేనప్పుడు...
కలం గారడీ కైతల వలలల్లకు
కలం గారడీ కైతల వలలల్లకు
మాట మాటు వైనాల వేటాడకు
గాలాన్ని దాచెడి ఎరగా మారకు
మహాకవిని పూటగడచు మాటాడకు
దోమల సంగీతాన్ని సామ మనకు
దొరతనాల దోపిడిని దోస్తీ అనకు...
కర్తవ్యం
వెనుకకు చూస్తే భూతం
కనిపించును చూడకు అటు
లభ్యం కాని భవిష్యం
లక్ష్యిస్తూ రభస పడకు
వర్తమానం వ్యర్థం చేయని
కర్తవ్యం నీదని మరవకు
ప్రచార దాసులు శ్రవణకుమారులు...
జాగ్రత
మన కలానికి కన్నొక్కట్టి
కలవు నాలుకలు రెండు
పడుపుకూడు మజా మెండు
గుటగుట మేసేటప్పుడు
లొటకలు వేసేటప్పుడు
ఉన్న కన్ను కూడ సున్న
జాగ్రత! జాగ్రత! జాగ్రత!!!
...
మళ్ళీ విప్లవం రావాలె
ఇంతకూ చెప్పదలచుకున్న దేమంటే
ఏ మాత్రం చెప్పేటట్లు లేదు పరిస్థితి
అయినా చెప్పక తప్పదు. చెప్పకుంటే
తప్పుతప్పున్నర కాబట్టి చెపుతున్నాను....