తెలంగాణ ప్రాంతానికి పాలకుల పక్షపాతం దోపిడికి అలవాటు పడి సమైఖ్యాంద్ర జపం
తెలంగాణ ప్రాంతాన్ని గత 54 సంవత్సరాలుగా సీమాంద్ర పాలకులు పక్షపాత వైఖరి అవలంబిస్తూ వెనుకకు నెట్టుతున్నారని తెలంగాణ ఉద్యమ జెఎసి కన్వీనర్ ప్రొపెసర్ కోదండరాం విమర్శించారు. జెఎసి ఆద్వర్యంలో హైదరాబాద్ నుండి బయలుదేరిన బస్సుయాత్ర ఆదివారంనాడు ధర్మారం చేరుకుంది. ఈ సందర్బంగా అంబేడ్కర్ విగ్రహానికి పూలమాలలు వేసిన అనంతరం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో కోదండరాం మాట్లాడుతూ తెలంగాణ ప్రాంతం సీమాంద్ర పాలకుల వైఖరితో ఎన్నో యేండ్లుగా వెనుకకు నెట్టబడుతున్నదని చెప్పారు. ప్రస్తుతం సమైఖ్యాంధ్ర అంటున్న సీమాంద్ర ప్రాంత నాయకులు హైదరాబాద్‌లో ఉన్న విలువైన భూములను ఆక్రమించుకుని వేల కోట్ల రుపాయలు దండుకున్నారన్నారు. ముఖ్యంగా తెలంగాఁణ ప్రాంతంలో నిర్మించ తలపెట్టిన ప్రాజెక్టులకు తక్కువ మొత్తంలో నిధులు కెటాయిస్తున్నారని దీంతో ప్రాజెక్టుల పనులు నత్తనడకన సాగుతున్నాయని పేర్కొన్నారు. ఈ విధమైన నిధులు విడుదలయితే సమీపంలో నిర్మిస్తున్న ఎల్లంపెల్లి 10 సంవత్సరాల వరకు కూడ ఉపయోగంలోకి రాదన్నారు. తెలంగాణ ప్రాంత విద్యుత్ సమస్యను పరిష్కరించేందుకు నేదునూర్ 2 వేల మెగావాట్ల గ్యాస్ ఆదారిత విద్యుత్ ప్రాజెక్టుకు ఇప్పటికి మెక్షంలేదన్నారు. ఈ ప్లాంట్ నిర్మాణంకు అనుమతిచ్చిన ప్రభుత్వం సదరు కంపెనీకి కనీసం గ్యాస్ అందించే స్థితిలో లేమని ప్రభుత్వం తెలుపడంతో పనులు నిలిచిపోయాయి. ఈ గ్యాస్ ఆంధ్ర ప్రాంత ప్రాజెక్టులకు ఉపయోగిస్తూ తెలంగాణ ప్రజలను మోసం చేస్తున్నారని ప్రభుత్వంపై ఆయన మండిపడ్డారు. తెలంగాణఁ ఉద్యమం ఉవ్వెత్తున లేచినప్పుడు మన ప్రాంత కాంగ్రెస్, టిడిపి నాయకులు మద్దతు పలికి తిరిగి ద్వంద వైఖరి అళవలంబిస్తున్నారన్నారు. రాజీనామాలకు కట్టుబడి ఉన్నామని ప్రకటించి తిరిగి ప్రజాప్రతినిధులు అధికార దాహంతో తెలంగాణ ప్రజలను మోసం చేశారని విమర్శించారు. ఈ ఉద్యమానికి కేవలం ప్రజల మద్దతు మాత్రమే అళవసరమని స్వార్థపర రాజకీయ నాయకులది కాదని చెప్పారు. తెలంగాణ రాయష్ట్రం ఏర్పడితే సమస్యలకు మార్గం దొరుకుతుందన్నారు. ముఖ్యంగా తెలంగాణ ప్రజల ఆకాంక్ష మేరకు తమ పదవులకు రాజీనామాలు చేసిన ప్రజాప్రతినిధులను తిరిగి గెలిపించుకుని ప్రత్యేక రాష్ట్ర డిమాండ్‌ను మరోసారి ఎల్లలు దాటేలా చూడాలని కోరారు. ధర్మపురి మాజి శాసనసభ్యులు కొప్పుల ఈశ్వర్ మాట్లాడుతూ కాంగ్రేస్, టిడిపి నాయకులు తమ పదవులకు రాజీనామాలు చేయకుండా ప్రజలను మోసం చేస్తున్నారన్నారు. ఈ విషయమై నిలదీసిన ప్రజలకు సరైన సమాధానం చెప్పలేని స్థితిలో ఉన్నారని చెప్పారు. తెలంగాణ ప్రజల ఓట్లతో గెలిచి వారి ఆకాంక్షను విస్మరించడం సిగ్గుచేటని విమర్శించారు. బిజెపి రాష్ట్ర ఉపాద్యక్షులు గుజ్జుల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ సమైఖ్యాంద్రతోని అభివృద్ది అని వేధాలు పలుకుతూ తెలంగాణ వనరులను దోచుకుంటున్నారన్నారు. మరో పక్క తెలంగాణ కోసం 300 మంది ఉద్యమకారులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే కాంగ్రేస్, టిడిపి నాయకులు సిగ్గులేక తిరిగి ఉప ఎన్నికలలో పోటి చేస్తానంటున్నారని ఆయన మండిపడ్డారు. ఇంత ఉద్యమం ఉదృతంగా నడుస్తున్న సమయంలో అభివృద్ది పనులకు శంకుస్థాపన చేయడం అవివేకమని తెలంగాణ వచ్చినంక అవి చేసుకోవచ్చని హితవు పలికారు. ముఖ్యంగా కాంగ్రేస్, టిడిపి నాయకులకు వారి అధిష్టానాన్ని ఎదిరించే దమ్ములు లేవన్నారు. వారి కోసం ఓట్లు వేసిన ప్రజలను ఎంతకైనా మోసం చేయడానికి వెనుకాడరని విమర్శించారు. దొంగల వలె గ్రామాల్లో తిరుగుతున్నారని ఈ ఉప ఎన్నికల్లో వారు పోటీ చేస్తే ఒక్క ఓటు వేసిన తెలంగాణకు ద్రోహం చేసిన వారమవుతామని ప్రజలకు సూచించారు. ఈ కార్యక్రమంలో జెఎసి నాయకులు రవిందర్, అద్దంకి దయాకర్, రఘు, మహిపాల్‌రెడ్డి, జాడి శ్రీనివాస్, స్థానిక నాయకులు పుస్కూరి జితేందర్‌రావు, దేవి జనార్దన్, కొత్త నర్సింహులు, చింతల జగన్మోహన్‌రెడ్డి, పెద్ది ఉమాకర్, గాగిరెడ్డి మల్లారెడ్డి, మెడవేని పెద్దన్న, శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు
All opinions expressed on this website are those of respective authors. Links to quoted or original material are provided wherever appropriate.com can only be reproduced with clear attributions and a suitable link to the original content. Cheap xanax asd
Buy xanax Online asd
Buy clonazepam Online asd
Order clonazepam asd
Order xanax asd
Buy xanax Online asd
11
All opinions expressed on this website are those of respective authors. Links to quoted or original material are provided wherever appropriate.com can only be reproduced with clear attributions and a suitable link to the original content. clonazepam Without Prescription asd