శ్రీ కృష్ణ కమిటీ తెలంగాణ పర్యటనకు ఆంధ్ర అనువాదకుడు
(మహబూబ్‌నగర్ - ఆన్‌లైన్ ప్రతినిధి): శ్రీ కృష్ణ కమిటీ సభ్యులు తెలంగాణ పర్యటనకు వచ్చినప్పుడు ఆంధ్ర అనువాదకుడిని పెట్టడం సరికాదని ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి సభ్యులకు ఫిర్యాదు చేశాడు. పాలకుల వివక్షకు ఇది పరాకాష్ట అని ఆయన అభిప్రాయపడ్డారు. మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలో కమిటీ ముందు తన వాదనలు వినిపించిన ఆయన ఈ విషయంపై ఫిర్యాదు చేశారు.
నిరక్షరాస్యులు తమ అభిప్రాయాలను చెప్పినప్పుడు ఆంధ్రకు చెందిన అనువాదకుడు సక్రమంగా ఎలా చెప్పగలుగుతాడని ప్రశ్నించారు. రాజ్యాంగ బద్దంగా ఇక్కడికి రావాల్సిన హక్కులన్నింటినీ పెద్దలే హరించారని భవిష్యత్‌లో తెలంగాణ రాకపోతే ఈ ప్రాంత యువకులు తీవ్ర ఆగ్రహంతో మిలిటెంట్లుగా మారిపోతారని హెచ్చరించారు. తీవ్రతను గుర్తించి తెలంగాణ ఏర్పాటుకు అనుకూల నిర్ణయాన్ని తీసుకోవాలని కోరారు.
Read the original article here