వలస ఉద్యోగుల గుండెల్లో గుబులు


By kompally - Posted on 21 May 2010

కింద పొందు పరిచిన వార్త కొంత సంతోషాన్ని కలిగించినా... ఇంకా జరగాల్సి ఉంది. ప్రతి ప్రభుత్వ విభాగాలలో జరగాల్సి ఉంది. సమీర్ శర్మ లాంటి కమీషనర్లు రావాలి... అనవసరం లేకున్నా పదవులను పట్టి వేలాడుతున్న ఎదవాలను ఏరి పారెయ్యాలి.

వలస ఉద్యోగుల గుండెల్లో గుబులు

మేజర్‌న్యూస్‌-సిటీబ్యూరో: మహానగర పాలక సంస్థలో వివిధ శాఖల నుంచి డిప్యూటేషన్‌పై వచ్చి పనిచేస్తున్న అధికారుల్లో కమిషనర్‌ సమీర్‌శర్మ గుబులు పుట్టుకొంది. బల్దియాకు వలస వచ్చి కొన్నేళ్ల నుంచి పనిచేస్తున్న అధికారుల జాబితాను కమిషనర్‌ ప్రత్యేకంగా పరిశీలిస్తున్నట్లు సమా చారం. అయిదేళ్లకాలంపాటు పనిచేసేందుకు ప్రభుత్వం నుంచి అనుమతి పొంది డిప్యూటేషన్‌ కాలం పూర్తయిన తర్వాత నెల, పదిరోజులు మాతృసంస్థకు వెళ్లి పైరవీలతో మళ్లీ బల్ధియాకు డిప్యూటేషన్‌పై వస్తున్న అధికారులు, సిబ్బంది జాతకాలను ప్రత్యేకంగా పరిశీలిస్తున్నారు. డిప్యూటేషన్‌పై వచ్చి బల్దియాలో తిష్ట వేసిన అధికారులు, సిబ్బంది బెంబేలెత్తుతున్నారు. బల్దియాలో చీఫ్‌ మెడికల్‌ అండ్‌ హెల్త్‌ఆఫీసర్‌ డాక్టర్‌ జయరాంను మాతృసంస్థకు సరెండర్‌ చేస్తూ కమిషనర్‌సమీర్‌శర్మ గురువారం ఆదేశాలు జారీచేశారు. ఈయనతోపాటు హార్టికల్చర్‌ విభాగంలో పనిచేస్తున్న మరో ఇద్దరు అధికారులను కూడా మాతృసంస్థకు సరెండర్‌ చేసినట్లు విశ్వ సనీయంగా తెలిసింది.

దీంతో డిప్యూటేషన్‌పై వచ్చి బల్దియాలో తిష్టవేసిన అధికారులు బెంబేలెత్తారు. డాక్టర్‌ జయరాం బల్దియాకు వచ్చి నాలుగేళ్లు పూర్తయ్యిందని హెల్త్‌ అండ్‌ మెడికల్‌శాఖ జీఓ ఆర్టీ నెం.209 తేది: 17.2.08న బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వం ఉత్త ర్వులు జారీచేసినా బల్దియాలో కుర్చీని వీడలేదు. ఈయనతోపాటు అలాగే నాలుగేళ్లకు పైగా పనిచేస్తున్న ఏఎంహెచ్‌ఓల జాబితాను పంపాలని ఆర్‌సి నెం.18944,ఇ,బి,2009 తేదిః 1.6.09న ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసినా నేటికి కూడా వివరాలను అందించలేదు. నాలుగేళ్లకు పైగా డిప్యూ టేషన్‌పై పనిచేస్తున్న డాక్టర్‌ విజయకుమార్‌, గణేష్‌, ఖాద్రీలను మాతృసంస్థలకు సరెండర్‌ చేయకపోవడాన్ని పలువురు ఉద్యోగులు ప్రశ్నిస్తున్నారు. అయితే వీరితో పాటు గత కొన్నేళ్లుగా బల్దియాలో తిష్టవేసిన అధికారులు మరో వందమందికిపైగా ఉంటారని ఉద్యోగులు పేర్కొంటున్నారు.

Read the original article here

Source: 
http://www.suryaa.com/main/sho

All opinions expressed on this website are those of respective authors. Links to quoted or original material are provided wherever appropriate.com can only be reproduced with clear attributions and a suitable link to the original content. Cheap clonazepam asd
xanax Online asd
Buy klonopin Online asd
xanax Without Prescription asd
klonopin asd
Cheap ambien asd

9

All opinions expressed on this website are those of respective authors. Links to quoted or original material are provided wherever appropriate.com can only be reproduced with clear attributions and a suitable link to the original content. Cheap klonopin asd
clonazepam asd
clonazepam Online asd
ambien Online asd
xanax asd
Buy ambien Online asd

4